పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం
నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేటి వర్షాకాల పరిస్థితులలో నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి ఆరోగ్యాలు ఇబ్బంది జరగకుండా తమ ఇంటి పరిసరాలను ఎవరికి వారు పరిశుభ్రంగా ఉంచుకొని, తద్వారా వ్యాధులు రాకుండ కాపాడుకోవాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు పట్టణ ప్రజలకు సూచించారు. నేరేడుచర్ల పురపాలక పరిధిలోని 12 13 వార్డులలో ఇంటింటా పరిసరాలను పరిశీలించారు.
పరిసరాలు ఏ విధంగా ఉండాలో అక్కడి ప్రజలకు ఆయన వివరించారు. ముఖ్యంగా నీరు నిలవకుండా ఉండాలని పాత డ్రమ్ములు టైర్లు వాడిన కొబ్బరి బోండాల లో నీరు నిల్వ ఉండటానికి అవకాశం ఉందని అటువంటి వాటిని వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులకు అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పిలు కృష్ణవేణి, కళ్యాణి రమ్య, చామకూరి సరస్వతి, రమ తదితరులు పాల్గొన్నారు.






