శ్రీ సమీక్షా మానసిక వికలాంగుల పాఠశాల ప్రారంభం
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్‌లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన విద్య, శిక్షణ, పునరావాస సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ సమీక్షా మానసిక వికలాంగుల పాఠశాలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్,డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని సమాజంలో ఆత్మవిశ్వాసంతో జీవించేలా తీర్చిదిద్దడం అత్యంత ముఖ్యమని అన్నారు.
ఈ పాఠశాల ద్వారా ప్రత్యేక విద్యతో పాటు స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, దైనందిన జీవన నైపుణ్యాల శిక్షణ వంటి సమగ్ర సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సేవా కార్యక్రమం సమాజానికి ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో పాఠశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.






