14 August, 2026 | 8:30 PM

Breaking News

పాలిటెక్నిక్ కాలేజీకి బస్సుల సౌకర్యం కల్పించాలి

14-08-2026 07:32 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు బస్సు ఏర్పాటు చేయాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్థులు శుక్రవారం నిర్మల్ డిఎం పండరి కి వినతి పత్రం అందించారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రెసిడెంట్  పవన్  మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రొద్దున సమయానికి బస్సు , బస్టాండ్ నుంచి సరైన సమయానికి  ఉండడం లేదని అదేవిధంగా కాలేజీ అయిపోయిన తర్వాత జగిత్యాల, ఖానాపూర్ వైపు నుంచి వచ్చే బస్సులు పాలిటెక్నిక్ కళాశాల దగ్గర ఆపడం లేదని వినతి పత్రం డిపో మేనేజర్ గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల  కార్యదర్శి అలీషా , లితిక , విద్యార్థులు  అజయ్ ,  కృష్ణ సాయి , మున్నా అభి, రిశ్వంత్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు