అయ్యప్ప ఆలయంలో ఘనంగా పంచామృత అభిషేకం
14-08-2026 07:34 PM
గజ్వేల్: శ్రావణమాసం పురస్కరించుకొని గజ్వేల్ పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్ గురుస్వామి మాట్లాడుతూ... శ్రావణమాసం నెల రోజుల పాటు ప్రతిరోజూ ఇద్దరు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.






