14 March, 2026 | 10:18 AM

హైదరాబాద్ నుంచి 3 రైలు సర్వీసులు

14-03-2026 02:15 AM
  1. స్పెషల్ రైళ్లు రెగ్యులర్ సర్వీసులుగా మార్పు
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం 

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి) : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేం ద్రం మరో శుభవార్త చెప్పిందని, మరో మూ డు కొత్త రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణి కుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మూడు స్పెషల్ ట్రైన్స్‌ను.. రెగ్యులర్ ట్రైన్స్‌గా మారు స్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుందని శుక్రవారం ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తంచేశారు. కాచిగూడ మధురై- కాచిగూడ రైలును కాచిగూడ- ట్యుటికోరిన్- డ ఎక్స్ ప్రెస్‌గా మార్చినట్టు తెలిపారు.

హైదరాబాద్ రైలు ను హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్టు పేర్కొన్నారు. చర్లప ల్లి  రైలు ను చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌గా మార్చినట్టు తెలిపా రు. మొత్తంగా మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ రైల్వే శాఖ తీసు కున్న నిర్ణయంపట్ల కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేస్తూ పీఎం మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.36,286 కోట్ల రైల్వే బడ్జెట్‌ను కేటాయించారన్నారు. తెలంగాణకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను మంజూరు చేశారని, ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఐదు వందే భారత్ రైళ్లు, నలుగు అమృత్ భారత్ రైల్లు సేవలను అందిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లు, నూతన మార్గాలను తీసుకొస్తామన్నారు.