1 August, 2026 | 2:57 AM

రేషన్ కార్డుదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

01-08-2026 12:00 AM

జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేన్ 

ములుగు, జూలై 31 (విజయక్రాంతి): రాబోయే వర్షాల దృష్ట్యా రేషన్ కార్డు లబ్ధిదారు ఒకేసారి మూడు నెలల సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఆగస్టు నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని, జులై చివరి వారంలోనే వర్షాల వల్ల రాబోయే రోజుల్లో  వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ములుగు జిల్లాలో దాదాపు  లక్ష 3వేలకి పైగా కార్డులు ఉన్నాయి.

ఒకేసారి మూడు నెలలకు సరిపడ కోటా 5,514 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినదని, ఇందుకోసం ములుగు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా ఫైసల్ హుస్త్స్రని తెలిపారు. ఒకేసారి మూడు నెలలకు సంబంధించి  ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర వేయాల్సి ఉందని, దీనికి తోడు సర్వర్ సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేన్ తెలిపారు.