21 April, 2026 | 10:24 PM

మోటార్ సైకిళ్లు ఢీకొని ముగ్గురు మృతి

19-02-2026 12:20 AM
  1. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం శివారు వద్ద ఇద్దరు..
  2. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ మరోకరు..

మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాం తి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోటార్ సైకిళ్లు ఢీకొని వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం శివారు కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద బుధవారం రాత్రి రెండు సైకిల్ మోటార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఘనపురం మండల కేం ద్రానికి చెందిన శ్రీకాంత్, భూపాలపల్లి మండలం నర్సింగాపురం చెందిన మహేష్ అక్కడికక్కడే మరణించారు.

భూపాలపల్లి ఎస్‌ఐ సాంబమూర్తి   కేసు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ సమీపంలో ద్వి చక్ర వాహనంపై వెళ్తున్న బయ్యారం గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తిని మరో సైకిల్ మో టార్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మ హబూబాబాద్ ఆస్పత్రిలో చికిత్స మరణించాడు.