ప్రమాద బాధితునికి రూ.20 వేల నిత్యావసరాలు
27-07-2026 02:28 AM
పేదలకు బియ్యం పంపిణీ
హుస్నాబాద్, జూలై 26: హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బా కాలనీకి చెందిన ప్రమాద బాధితుడు మంద సదానందం కుటుంబానికి బీఆర్‌ఎస్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ కూతాటి విజయభాస్కర్ రూ.20 వేల విలువైన మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.
గత మూడు నెలలుగా బాధిత కుటుంబానికి వైద్య, ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. అదేవిధంగా కేబీ కాలనీలోని పలువురు నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆయన సేవా కార్యక్రమాలను స్థానికులు అభినందిస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ఆదర్శనీయమని కొనియాడారు.






