1=100
15-07-2026 01:19 AM
శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘1=100’. ఇందులో హీరోగా కృష్ణ కుమార్, హీరోయిన్‌గా అర్పిత లోహి నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకకు ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ టీజర్ ఆకట్టు కుంటోంది. అనిల్‌కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ, కెన్నీ చైతన్య సంగీతం, నందమూరి హరి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలం గా నిలవనున్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.






