ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకం
- ఫీల్డింగ్ కోచ్ దిలీప్ భావోద్వేగం
- కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్
ముంబై, ఆగస్టు 3: భారత పురుషుల క్రికె ట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా ఐదేళ్ల పాటు విశేష సేవలందించిన టి. దిలీప్ పదవీకాలం ముగిసింది. బిసిసిఐ అతని కాంట్రాక్టును పొడిగిం చకపోవడంతో, ఆయన స్థానంలో శుభదీప్ ఘోష్ కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. నవంబరు 2021లో ఆయన టీ మిండియా ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన జింబాబ్వే పర్యట నతో దిలీప్ పదవీకాలం పూర్తయింది. 20 23 వన్డే ఈ ప్రపంచకప్ సమయంలో డ్రె స్సింగ్ రూంలో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్ర తిభ కనబరిచిన ఆటగాడికి బెస్ట్ ఫీల్డింగ్ మె డల్ ఇచ్చే సరికొత్త సంప్రదాయాన్ని ఈయ నే ప్రారంభించారు.
కోచ్‌గా ఆయన ఐదేళ్ల కాలంలో భారత జట్టు ఎన్నో చారిత్రాత్మక విజయాలను సొంతం చే సుకుంది. పదవీ కాలం ముగిసిన నేపథ్యం లో దిలీప్ సోషల్ మీడియా వేదికగా ఒక భా వోద్వేగభరితమైన వీడ్కోలు లేఖను పంచుకున్నారు. ‘టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఈ ఐదేళ్ల అనుభూతిని మాటల్లో వర్ణించడం చా లా కష్టం. భారత జట్టులోకి అడుగుపెట్టినప్పుడు నిబద్ధతతో పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకు ఇష్టమైన ఆటలో ఫీ ల్డింగ్ ద్వారా దేశం కోసం నా వంతు పాత్ర పోషించినందుకు ఎంతో గర్విస్తున్నాను’ అని ఆ యన పేర్కొన్నారు.






