సంస్కృతి పరిరక్షణకే ఈ యాత్ర
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటే ష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్టుకు అనుగుణంగా ప్రత్యేక ప్రచార శైలిని అనుసరిస్తున్నారు.
ఇందులోభాగంగా శనివారం ఆనంత పద్మనాభ స్వామి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో విరాట్ కర్ణ మాట్లాడుతూ.. “నాగబంధం ఎంతో కష్టపడి చేసిన సినిమా. జూలై 3న అరందరూ థియేటర్లకు వెళ్లి మా చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో భాగంగా మేము అనేక నగరాలను సందర్శించబోతున్నాం” అన్నారు. హీరోయిన్ నభా మాట్లాడుతూ.. “స్వామివారి రథయాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కొనసాగుతుంది.
జూలై 3న సినిమా విడుదల కానుంది. అందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరుకుంటున్నా” అని తెలిపారు. డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ.. “ఇది కేవలం సినిమా ప్రమోషన్స్ కాదు, మన సంస్కృతి, మూలాలను తర్వాతి తరానికి పరిచయం చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం” అని చెప్పారు. ‘కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు ఈ రథయాత్ర కొనసాగుతుంద’ని నిర్మాత నిశిత నాగిరెడ్డి తెలిపారు. ‘తప్పకుండా నాగబంధం ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నామ’ని కిషోర్ అన్నపురెడ్డి చెప్పారు. ఈ వేడుక చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.






