ఇది అత్యంత అవమానకర ఓటమి
ఆసీస్ జట్టుపై మాజీల ఆగ్రహం
డార్విన్, ఆగస్టు 16 : బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమిని ఆ దేశ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాజయం పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటిం గ్, మార్క్‌వా, మాథ్యూ హెడెన్ తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ పూర్తిగా విఫలమైందని, ఈ తరహా ఘోర పరాజయాన్ని తాము నమ్మలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరాజయమని మాజీ ఆటగాడు మార్క్ వా అభివర్ణించాడు.
మూడేళ్ల క్రితం గబ్బా వేదికగా వెస్టిండీస్ చేతిలో ఓటమి కంటే ఇది దా రుణమైన ఓటమిగా అభివర్ణించాడు. మరోవైపు ఈ పరాజయాన్ని ‘అత్యం త అవమాన కరం’గా మాజీ కెప్టెన్ రికీ పాం టింగ్ అభివర్ణించాడు. జట్టులో తక్షణమే మార్పులు చే యాల్సిన అవసరం ఉందన్నాడు. సాధారణంగా జట్టులో మార్పులు చేయడాన్ని తా ను స్వాగతించననీ ఆసీస్ ఓటమితో టాప్ ఆర్డర్‌ను పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. ఓపెనింగ్ స్థానంతో పాటు మూడోస్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని పాంటింగ్ సూచించాడు.






