17 August, 2026 | 4:08 AM

ముగిసిన ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్

17-08-2026 01:55 AM

హైదరాబాద్, ఆగస్టు 16 : హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈక్వె స్ట్రియన్ ఛాలెంజ్ పోటీలు ఉ త్సాహంగా ముగిసాయి. జూనియర్ స్థాయిలో యువ రైడర్లు ఈ పోటీలలో సత్తా చాటారు. అండర్ 12 డ్రెస్సేజ్ జూనియ ర్, డ్రెస్సేజ్ చిల్డ్రన్, షో జంపిం గ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఆర్చి హార్స్ రైడింగ్ క్లబ్ కు చెంది రైడర్లు చివరి రోజు ఆధిపత్యం కనబరిచారు. షో జంపింగ్ 40 సెం.మీ ఓపెన్, 105110 సెం.మీ క్లాస్ విభాగాల్లో మొత్తం మూడు స్థానాల్లోనూ వాళ్ళే విజేతలుగా నిలిచారు.

షో జంపింగ్ 40 సెం.మీ విభాగం మొదటి స్థానంలో నాగ్ హృదాన్ ములుగు, యువాన్ తుమ్మ ల రెండో స్థానంలో, శౌర్యన్ బత్తుల మూడో స్థానంలో నిలిచారు. హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్‌కు చెందిన అయా న్ వర్మ నడింపల్లి నాలుగో స్థా నం సాధించాడు.

షో జంపిం గ్ 40 సెం.మీ ఓపెన్ విభాగంలో యువాన్ తుమ్మల, శౌ ర్యన్ బత్తుల, సీ కుమార్ (హెచ్ పిఆర్‌సీ) వరుసగా తొలి మూ డు స్థానాల్లో నిలిచారు. రామ్ రెడ్డి బొట్టా నాలుగో స్థా నంలో నిలిచాడు. షో జంపింగ్ 105110 సెం.మీ కేటగిరీలో జగదీష్ టాప్ ప్లేస్ సాధించగా, జెరోన్ షెపర్స్ రెండో స్థానంలో, సంజిత్ మూడో స్థానంలో, మహ్మద్ అమాన్ అలీ నాలుగో స్థానంలో నిలిచారు. కాగా మొద టి స్థానంలో నిలిచిన రైడర్‌కు రూ.20 వేలు, రెండో స్థానంలో రైడర్‌కు రూ.10 వేలు, మూడో స్థానంలో రైడర్‌కు రూ.7500, నా లుగో స్థా నంలో నిలిచిన రైడర్‌కు రూ.5 వేలు ప్రైజ్ మనీగా అందజేశారు.