17 August, 2026 | 3:10 AM

చైనాతో భారత్ మ్యాచ్ డ్రా

17-08-2026 01:58 AM

మహిళల హాకీ ప్రపంచ కప్

బెల్జియం, ఆగస్టు 16 : ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐ హెచ్ హాకీ ప్రపంచ కప్‌ను భారత మహిళల జట్టు డ్రాతో ఆరంభించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చైనాతో 2-2తో డ్రాగా ముగించింది. ఆరంభంలోనే ఆధిక్యం సాధించినప్పటికీ.. భారత మహిళల జట్టు విజయాన్ని దక్కించుకోవడంలో విఫలమయింది. ఈ డ్రా ఫలితంగా భారత్, చైనా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. తొలి క్వార్టర్లోని ఎనిమిదో నిమిషంలో దీపి కా తొలి గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది.

అయితే భారత జట్టు ఆనం దం ఎక్కువసేపు నిలవలేదు. తొలి క్వార్టర్ ముగియడానికి కేవలం ఒక నిమిషం ముం దు, 14వ నిమిషంలో చైనా క్రీడాకారిణి జాం గ్ యింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి స్కోరును సమం చేసింది. దీంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి ఇరు జట్లు సమంగా నిలిచాయి. రెండో క్వార్టర్‌లో భారత క్రీడాకారిణి దీపిక మరోసారి పెనాల్టీ కార్నర్ నుంచి ఓ అద్భుతమైన గోల్ చేసి భారత్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత రెండో క్వార్టర్‌లో చైనా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.

మొదటి సగం 30 నిమిషాలు ముగిసేసరికి, మ్యాచ్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ ఆధిక్యాన్ని మరింత పెం చుకునే అవకాశం ఆ జట్టుకు లభించింది. కానీ మూడో, నాలుగో క్వార్టర్లలో చైనా తన పటిష్టమైన డిఫెన్స్‌తో భారత్‌ను ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. మూడో క్వార్టర్ 39వ నిమిషంలో మా నింగ్ చేసిన గోల్‌తో స్కోరు 2-2తో సమమైంది. నాలుగో క్వార్టర్ లో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భార త్ గ్రూప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాను 4-0తో ఓడించిన ఇంగ్లాండ్ 2 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, చైనా, భారత్ చెరో పాయింట్‌తో వరుసగా రెండో, మూడో స్థా నాల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. భారత్ మంగళవారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.