20 May, 2026 | 8:18 AM

ఈ పక్షి రాత్రి సంచారి

20-05-2026 12:00 AM
  1. కవ్వాల్ అభయారణ్యంలో అరుదైన ఇండియన్ నైట్ జార్
  2. కెమెరాలో బంధించిన జన్నారం ఎఫ్డీవో
  3. నేలపైనే గుడ్లుపెట్టడం, పరిసరాల రంగులో కలిసిపోవడం దీని ప్రత్యేకత

జన్నారం, మే 19: సాధారణంగా పక్షులు ఉదయం నుంచి సూర్యాస్తమ యం వరకు ఆహారం వేటలో ఉంటా యి. చీకటి పడేలోపు గుడుకు చేరుకుంటాయి. కానీ ఓ పక్షి ఆహారం కోసం రాత్రి పూట మాత్రమే సంచరిస్తుంది. అందుకే దీనిని రాత్రి సంచారి అంటారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యంలో ఈ అరుదైన రాత్రి సంచారి పక్షి ఇండియన్ నైట్ జార్ కనిపించింది.

రాత్రి వేళల్లో సంచరించడమే ఈ పక్షి ప్రత్యేకత. ఈ పక్షి చెట్ల బెరడు, నీలి రంగులు కలిసి నిచ్చలంగా ఉండ టం వల్ల దీనిని సాధారణం గా గుర్తించడం కష్టం. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పురుగులను ఆహారంగా తీసుకుంటూ అడవిలో సంచరిస్తూ ఉంటుంది. 

ఇది మిగతా పక్షుల్లా చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకోకుండా నేలపైనే స్థావ రం ఏర్పాటుచేసుకొని గుడ్లు పెడుతుం ది. పరిసర ప్రాంత రంగులో కలిసిపోయే శరీర నిర్మాణంతో శత్రువుల నుంచి రక్ష ణ పొందడం ఈ ఇండియన్ నైట్ జార్ మరో ప్రత్యేకత. అరుదుగా కనిపించే ఈ పక్షిని జన్నారం అటవీ విభాగాధికారి (ఎఫ్డీవో) రామ్మోహన్ అడవిని పర్యవేక్షించే సమయంలో కనిపించడంతో తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవ్వాల్ అడవు ల్లో ఉన్న సహజ వాతావరణం, దట్టమైన అడవి కారణంగా ఇలాంటి ఎన్నో పక్షులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.