30 June, 2026 | 9:24 PM

Breaking News

వయసుకు మించిన ఆలోచన నేటి యువతకు ప్రేరణ

14-04-2026 12:00 AM

భువనగిరి డివిజన్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి 

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 13 : వయసుకు మించిన ఆలోచన యువతకు ప్రేరణ అని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సిఐ ఎలగొండ కృష్ణ కుమారుడు ఎలగొండ రూవిన్ సాయి వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఎంత ప్రమాదమో పాట ద్వారా వివరించడం అభినందనీయమని భువనగిరి డివిజన్ డిఎస్పి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆరైవ్- అలైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న

సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని రూవిన్ సాయి హెల్మెట్ పైన ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకుని పాట రూపొందించగా ఈ పాటను ఆయన ఆవిష్కరించినారు. హెల్మెట్ పైన రూపొందించిన పాట చాలా బాగుందని రువిన్ సాయిని డిఎస్పి అభినందించి, సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ ఎలగొండ కృష్ణ,భువనగిరి ట్రాఫిక్ సిఐ మధుసూదన్ గారు పాల్గొన్నారు.