30 June, 2026 | 10:16 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

కేటీఆర్ ఎన్ని పాదయాత్రలు చేసినా పాపాలు పోవు

14-04-2026 12:00 AM

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య  

హైదరాబాద్, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి): ‘కేటీఆర్ ఎన్ని పాదయాత్రలు చేసినా చేసిన పాపాలు పోవు..  ఆయనకు కాళ్ల, కీళ్ల నొప్పులు తప్ప ఏమీ మిగలదు.. పాదయాత్ర కాదు గంగలో మునిగి గోదావరిలో తేలినా ఉపయోగం లేదు’. అని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. పార్టీ పేరు మారిస్తే మోసం పోవడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు.

సోమవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఎందుకు పాదయాత్ర చేస్తావ్..? ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు లాంటి వి ఇచ్చి పేదలను ఆదుకుంటున్నదుకు పాదయాత్ర చేస్తావా..? అని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబ నక్కజిత్తులు తెలంగాణ ప్రజలకు తెలుసని, అధికారం పోయాక జ్ఞనోదయం అయినట్లు కేటీఆర్ నటిస్తున్నాడని, కొన్ని తప్పులు చేశామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని మండిపడ్డారు.

పార్టీ పేరును బీఆర్‌ఎస్ గా మార్చి నష్టపోయామని కేటీఆర్ చిలుక పలుకులు పలుకుతున్నాడు. పార్టీ పేరు మార్చినందుకు కాదు జనం ఓడించింది.  కేటీఆర్ మీరెంత అమాయకత్వం నటించినా ఉపయోగం లేదు అని ఐలయ్య అన్నారు.