11 June, 2026 | 1:26 AM

మళ్లీ నల్ల మట్టిని ఎత్తుకెళ్తున్నారు

11-06-2026 12:25 AM
  1. నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
  2. కలెక్టర్ దృష్టి సారిస్తేనే మట్టి తరలింపు నిలిచి పోతుంది

బోయినపల్లి: జూన్ 10(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దుండ్రపల్లి, విలాసాగర్ చెరువుల నుంచి అక్రమార్కులు అడ్డగోలుగా నల్ల మట్టిని తరలిస్తున్నారు. దుండ్రపల్లి చెరువు నుంచి గతంలో కూడా అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టి తరలించారు. మళ్లీ తాత్కాలికంగా నిలిపి వేసి గత నాలుగు రోజులుగా మళ్లీ ఎక్స్వే వేటర్ల సహాయంతో లారీల్లో మట్టిని తరలిస్తున్నారు.

ఉదయం రాత్రి కూడా ఎటువంటి నిబంధనలను పాటించకుండా నల్ల మట్టిని ఇటుక బట్టీలకు ఇతర వ్యాపారాలకు అక్రమార్కులు తరలించిన నియంత్రించాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబంధన ప్రకారం నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు కొలతలు వేసి ఇచ్చిన స్థలంలో మట్టిని తీసుకెళ్లాలి. లేదా ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో మట్టిని తరలించాలి.

కానీ దుండ్రపల్లిలో నిబంధనలు ఎక్కడా కనిపించడం లేదు అమలు కావడం లేదు. ఇంజనీరింగ్ అధికారులు అటువైపున కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. లస్కర్లు అక్కడ ఉన్న వారి వద్ద ఎటువంటి అనుమతి కాపీ లేదు. ఈ విషయమై సంబంధిత ఏ ఈ మహేందర్ ను విజయ క్రాంతి వివరణ కోరగా తన వద్ద కాపీలేదని నేను ఇప్పుడు ఫీల్ లో ఉన్నానని, రేపు అనగా గురువారం ఉదయం ఆఫీస్ కి వెళ్ళాక కాపీ వాట్సప్ చేస్తానని సమాధానం ఇచ్చారు.