11 June, 2026 | 1:24 AM

మహిళల రక్షణకు ప్రాధాన్యత

11-06-2026 12:27 AM

 మెట్ పల్లి డిఎస్పీ రాములు 

మెట్ పల్లి,జూన్ 10(విజయక్రాంతి): మెట్ పల్లి డివిజన్ పరిధిలో మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మెట్ పల్లి డి ఎస్పీ రాములు తెలిపారు. బుధవారం మండలంలోని వెల్లుల్ల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో మెట్ పల్లి డీఎస్పీ రాములు, మెట్ పల్లి సీఐ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాల నివారణ అరైవ్, అలైవ్ సైబర్ నేరాల అవగాహన, సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత, మాదకద్రవ్యాల నివారణ అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణకు సంబంధించిన చట్టాలు, మహిళల హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానం గురించి వివరించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండడం, గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు సూచనలు చేశారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు వాటి నివారణకు సమాజం సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ కిరణ్ కుమార్ సర్పంచ్ గూడూరు తిరుపతి,గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.