30 March, 2026 | 2:23 AM

రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు 179, ఎంపీ సీట్లు26

30-03-2026 12:45 AM
  1. 50 శాతం ప్రదిపాదన అమలైతే
  2. హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): డీలిమిటేషన్‌లో భాగంగా 50 శాతం పెంపు ప్రతిపాదనకు కాంగ్రెస్ ఎందుకు అడ్డుపడుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈ 50 శాతం ప్రతిపాదన అమలైతే తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లు 119 నుంచి సుమారు 179కి, పార్లమెంట్ సీట్లు 17 నుంచి సుమారు 26కి పెరిగే అవకాశం ఉందన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 సీట్లు సుమారు 816కి పెరిగే అవకాశముందని, దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ప్రాతినిధ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, తమ ప్రభుత్వం గడువు ముగిసిన తర్వాత 6 నెలలు పొడిగిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని ఆరోపించారు. అది రాజ్యాంగ విరుద్ధమని, జమిలి ఎన్నికలు 2029లో జరిగినా రాజ్యాంగానికి లోబడేనని అన్నారు.