30 March, 2026 | 3:55 AM

సింగరేణి మాజీ సీఎండీ గొప్ప వ్యక్తి

30-03-2026 12:43 AM

విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): సింగరేణిని ఉన్నత స్థాయిలో నిలిపిన వ్యక్తి మాజీ సీఎండీ బలరామ్ అని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. సమాజానికి సేవ చేయాలన్న మనసున్న గొప్ప వ్యక్తుల్లో ఒకరని కొనియాడారు.

ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో సింగరేణి ఎంప్లాయీస్ అండ్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి మాజీ సీఎండీ ఎన్.బలరామ్ పౌరసన్మానం, వీడ్కోలు కార్యక్రమంలో కాకి మాధవరావు మాట్లాడారు.

తాను ఎందరికి ఆదర్శంగా ఉన్న తనకు మాత్రం బలరామ్ ఆదర్శమన్నారు. సింగరేణికి బలరామ్ చేసిన సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఘనంగా సన్మానించాలని విశ్రాంత ఐఐఎస్ అధికారి జేబీ.రాజు ఆకాంక్షించారు.