30 August, 2026 | 10:11 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి

07-07-2026 07:48 PM

సూర్యాపేట జిల్లా వ్యవసాయ శ్రీధర్ రెడ్డి

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని,కావున రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ శ్రీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని జయలక్ష్మి ఫెర్టిలైజర్ షాప్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఫర్టిలైజర్ షాప్ లో ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, బిల్ బుక్కులు, స్టాక్ రిజిస్టర్స్, గోడౌన్ లో స్టాక్ ని వెరిఫై చేసి డీలర్లకు తగు సూచనలు చేశారు.రైతులను ఉద్దేశించి, జిల్లాలో ఎక్కడైనా సరే అధిక ధరలకు ఎరువులు విక్రయించినట్లయితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారి లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించాలని తెలిపారు.ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జావేద్, తదితరులు పాల్గొన్నారు.