30 August, 2026 | 8:17 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం

07-07-2026 07:50 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన బొల్లె ప్రశాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న క్లస్మెట్స్ మానవత్వాన్ని చాటుతూ ఆయన కుటుంబానికి రూ.37,300 ఆర్థిక సహాయం అందజేశారు. ప్రశాంత్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉండటంతో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో స్నేహితులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులు స్నేహితుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టసమయంలో స్నేహితులు చూపిన ఆదరణ అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.