ఎండ్రియాలలో పుస్తెలతాడు చోరీ
తాడ్వాయి, ఏప్రిల్ 2(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఏండ్రి యాల్ గ్రామంలో గురువారం ఓ మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీకి గురైంది. గుర్తుతెలిని వ్యక్తి పక్కా ప్రణాళికతో వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును బలంగా లాక్కుని వెళ్లిపోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏండ్రి యాల గ్రామానికి చెందిన బాణాల అనసూయ ఉదయం వేకువజామునే నిద్రలేచి వాకిలి ఊడుస్తున్న సమయంలో పక్కా ప్లాన్ తో వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వాకిలి నూకుతున్న సమయంలో మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కుని వెళ్లిపోయారు. ఆయన ముందుగానే ప్రణాళిక వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. బాణాల అనసూయ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరా లో వీడియో ఫుటేజీలు రికార్డు కాకుండా ఆ కెమెరాకు గుంతలు కట్టివేశాడు.
అక్కడే ఉన్న మరి మరో సీసీ కెమెరాను గమనించలేదు. దీంతో చోరీకి పాల్పడ్డ వ్యక్తి ముఖానికి మాస్కు కట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న వీడియో పుటేజి సీసీ కెమెరా లో నమోదు అయి ఉంది. ఈ విషయమై స్థానికులు మాట్లాడుతూ... పక్కా ప్రణాళికతోనే కొన్ని రోజుల నుంచి గమనించిన స్థానిక వ్యక్తి యే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కచ్చితంగా సదరు చోరీకి పాల్పడ్డ వ్యక్తిని గుర్తించి పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి దొంగతనాలు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




