13 August, 2026 | 2:11 AM

గడ్డపారతో షట్టర్లు లేపి దొంగతనం

13-08-2026 12:55 AM

నిర్మల్ ,ఆగస్టు 12( విజయ క్రాంతి); నిర్మల్ జిల్లా కేంద్రంలో చోరీల నియంత్రణ కు పోలీస్ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్న చో రీలు మాత్రం ఆగడం లేదు. దొంగలు ఇండ్లతోపాటు వ్యాపార దుకాణాల టార్గెట్ గా దో పిడీ చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి బ స్టాండ్ సమీపంలో ఉన్న మూడు వ్యాపార దుకాణంలో దొంగలు పడ్డట్టు వ్యాపారాలు తెలిపారు . గడ్డపారులతో షట్టర్లను ధ్వంసం చేసి సమద్ కాంప్లెక్స్ లోని నూరని ట్రేడర్స్ దుకాణం కౌంటర్ లో ఉన్న సుమారు రూ.7 వేల నగదును ఎత్తుకెళ్లారు.

అదే ప్రాంతంలో ని విద్యుత్ కార్యాలయం పక్కన ఉన్న నారాయణ ఫ్యాన్సీ, రాజారాం ట్రేడింగ్ దుకాణా ల షట్టర్లను సైతం గడ్డపారతో లేపి దొంగతనానికి ప్రయత్నించారు. బుధవారం ఉదయం దుకాణాలకు వచ్చిన యజమానులు షట్టర్ల తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు లు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో వరుసగా దొంగతనం జరగడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.