13 August, 2026 | 3:18 AM

పెద్దేముల్‌లో ‘హర్- ఘర్ తిరంగా‘ ర్యాలీ

13-08-2026 02:03 AM

భారీగా హాజరైన యువత 

తాండూరు, ఆగస్టు 12, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో బుధవారం యువకులు,విద్యార్థులు తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై... వందే మాతరం.. అంటూ నినాదాలు చేస్తూ మువ్వన్నెల జెండా చేతబట్టి పురవీధులగుండా ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా తిరంగా అభియాన్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతి ఐక్యత, దేశభక్తి చాటాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.