13 August, 2026 | 2:15 AM

ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

13-08-2026 12:57 AM

ఆదిలాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): మారుతున్న వాతావరణ పరిస్థితులు, ‘ఎల్ నినో’ ప్రభావంతో తలెత్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం, రైతాంగం సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజ ర్షి షా సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా స మావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ని ప్రస్తుత నీటి లభ్యత, ప్రాజెక్టులలోని నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

నీటి వనరులను శాస్త్రీయంగా వినియోగిస్తూ తా గునీరు, సాగునీటి అవసరాలను సమతుల్యంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులలో అందుబా టులో ఉన్న నీటి నిల్వలను సమీక్షించిన కలెక్టర్, తాగునీటి అవసరాలకు తొలి ప్రాధా న్యత ఇవ్వాలని, అనంతరం సాగునీటి పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలని అధి కారులను ఆదేశించారు. ప్రాజెక్టుల్లోని నీటి లభ్యతను బట్టి పంటల సాగు ప్రణాళిక రూ పొందించాలని, ప్రతి రైతుకు సమానంగా నీరు అందేలా చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరా జరిగేలా పటిష్ట చర్యలు తీసు కోవాలని సూచించారు.

వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో రై తులతో నిరంతరం అనుసంధానమై పనిచేయాలని, తక్కువ నీటితో అధిక దిగుబ డినిచ్చే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సా గుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, వే సవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదే శించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ జగదీష్, సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రభు కల్యాణ్ తదితరులున్నారు.