13 August, 2026 | 3:17 AM

రాక్‌బాల్ క్రీడాకారుడికి కవిత అభినందన

13-08-2026 02:05 AM

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 12 (విజయక్రాంతి): దక్షిణాసియా రాక్బాల్ టోర్నమెంట్లో భారత జట్టు విజయానికి విశేషంగా కృషి చేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన మేడ్చల్ జిల్లా పూడూరు గ్రామానికి చెందిన క్రీడాకారుడు గోపాల్ యాదవ్ బుధవారం టీఆర్‌ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితను వారి నివాసంలో కలిశారు.

ఈ సందర్భంగా గో పాల్ యాదవ్‌కు కవిత శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీ య స్థాయిలో జట్టుకు ప్రా తినిధ్యం వహించి విజయం లో భాగస్వామి కావడం గర్వకారణమని అన్నారు. తె లంగాణ యువత క్రీడల్లో రాణించడం సం తోషంగా ఉందనారు. గోపాల్ యాదవ్ భవిష్యత్తులో రాణించి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.