13 August, 2026 | 3:06 AM

ప్రభుత్వం వినూత్న ప్రయత్నం

13-08-2026 01:54 AM
  1. నీట్, జేఈఈలకు లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ
  2. ఈ నెల16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
  3. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల విజ్ఞప్తి

భూపాలపల్లి, ఆగస్టు 13 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఇంటర్ పూర్తి చేసిన వెనకబడిన తరగ తుల (బీసీ) విద్యార్థులు జాతీయ స్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరచి, ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు, మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించేలా మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థలు చర్యలు చేపట్టాయి. నీట్-యూజీ, జేఈఈ 2027కు గాను ఉచిత లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తోంది. ఇంటర్ లో ఉత్తీర్ణులైన, నీట్, జేఈఈ-2026లో మెరుగైన ప్రతిభ చూపిన విద్యార్థులు శిక్షణకు అర్హులు.

ఎంపిక విధానం..

ప్రవేశాలు మెరిట్, సీట్ల లభ్యత ఆధారంగా కల్పిస్తారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవ కాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రణాళికతో తరగతులు, మాక్ టెస్ట్ లు, గ్రాండ్ టెస్ట్ లు నిర్వహిస్తారు. వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటొద్దు.ఈ నెల 9న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 16వ తేదీ వరకు కొనసాగనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకు నీట్లో 100, జేఈఈలో 40 సీట్లు, బాలు రకు నీట్ లో 50, జేఈఈలో 50 బాలికలకు సీట్లు ఉన్నాయి. సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కళాశాల నాగోల్, బాలురకు సీవోఈ కళాశాల అబ్దుల్లాపూర్‌మెట్‌లో లాంగ్ టర్మ్ శిక్షణ అందిం చనున్నారు. దరఖాస్తులు చేసుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా https://mjp tbcadmissions.org వ్బుసైట్లో చేసుకోవాలి. నిపుణు లైన అధ్యాపకుల చేత బోధన, ఉచిత వసతితో పాటు స్టడీ మెటీ రియల్ను అందించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీసీ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. దీని ద్వారా వైద్య, ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలు పొంది, ఆయా రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది.

 (డీసీఓ) జిల్లా కోఆర్డినేటర్ స్వప్న