13 August, 2026 | 2:32 AM

నేడు భూమిపూజ

13-08-2026 01:11 AM
  1. కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం 
  2. ప్లాట్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు 
  3. అన్ని కేటగిరీల్లో మహిళలకు 30 శాతం 
  4.    16 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద 7,340 ప్లాట్ల నిర్మాణం 
  5. సర్కార్ సబ్సిడీ రూ. 5 లక్షలు.. లబ్ధిదారుడి వాటా రూ.6 లక్షలు 
  6. లబ్ధిదారుడి వాటా విడతల వారీగా చెల్లించేందుకు అవకాశం 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. రిజర్వేషన్ల ప్రకారం.. ప్లాట్ల కేటాయింపు జరగనుంది. అన్ని కేటగిరీల్లో మహిళలకు 30 శాతం కేటాయించనున్నారు. హైదరాబాద్ పరిధిలో మొత్తం లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తోంది. క్యూర్ పరిధిలో 12 వేల ఫ్లాట్లతో పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. తొలి దశలో 18 చోట్ల 7,340 ఫ్లాట్ల నిర్మా ణం చేపడుతుంది. హైదరాబాద్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటిని నిర్మించనున్నా రు. రూ.807.40 కోట్లతో వీటి నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

ఒక్కో ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరి యా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరి యా ఉంటుంది. ఒక్కో ఫ్లాట్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందిస్తుండ గా, మిగతా రూ.6 లక్షలు లబ్ధిదారుడి వాటాగా చెల్లించా ల్సి ఉంటుంది. రూ.6 లక్షల వరకు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయిం చింది. దరఖాస్తుదారుడికి క్యూర్ పరిధిలో సొంత ఇల్లు, ప్లాట్ లేదా ఫ్లాట్ ఉండకూడదు.

ఒక కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తారు. దరఖాస్తుదారులు తాము నివసిస్తున్న అసెం బ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టుకే దర ఖా స్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఎలాంటి సర్టిఫికెట్లు అవసరం లేదని, అయితే దరఖాస్తు ఫీజు రూ.100, టోకెన్ అడ్వాన్స్ రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ అలాట్ కాకపోతే ఈ డబ్బును ప్రభుత్వం తిరిగి ఇస్తుంది. ఫ్లాట్ కేటాయింపు జరిగితే ఆ మొత్తాన్ని లబ్ధిదారుడి వాటాలో సర్దుబాటు చేస్తారు.

ఆగస్టు 15 దాకా దరఖాస్తుల స్వీకరణ

మీసేవ కేంద్రాలు, మీ సేవ వాట్సాప్ సర్వీస్ 8096958096 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిం చింది. ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 15 చివరి తేదీ కాగా, అర్హతలను పరిశీలించిన అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయి స్తారు. ఫ్లాట్ల కేటాయింపు ల్లో ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, క్లాస్-4, పారి శుధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుం ది. మిగిలిన 50 శాతం ఫ్లాట్లు జనరల్ కేటగిరీకి కేటాయి స్తారు. అన్ని కేటగిరీలో 30 శాతం ఫ్లాట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ సమయంలో రూ.1 లక్ష, ఆర్‌సీసీ నిర్మాణం పూర్తయ్యాక రూ.2 లక్షలు, ఫినిషింగ్ దశలో మరో రూ.2 లక్షలు, మిగిలిన మొత్తాన్ని ఫ్లాట్ అప్పగించే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.

కేబీహెచ్‌బీ కాలనీలో 480 ఇండ్ల నిర్మాణం

ముఖ్యమంత్రి భూమిపూజ చేయనున్న కేపీహెచ్‌బీ కాలనీలో 480 ఇందిరమ్మ ఇం డ్లు ఫ్లాట్ల నిర్మాణం ప్రతిపాదించారు. ఇక మల్కాజిగిరి లోని కౌకూర్‌లో, శేరిలింగంపల్లి రాయదుర్గంలో, మహేశ్వరం జల్‌పల్లిలో, నాంపల్లిలో రెడ్‌హిల్స్, నీలోఫర్ సైట్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నారు.

సనత్‌నగర్ లోని పాటిగడ్డ, మలక్‌పేట్‌లోని గడ్డిఅన్నా రం, ఇబ్రహీం పట్నం బండ్లగూడ, మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం, రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవర్‌పల్లి, కుత్బుల్లాపూర్ లోని గాజులరామారం, ఖైరతాబాద్ పరిధిలో హకీంపేట్ దర్గా వద్ద, జూబ్లీహిల్స్, అం బర్‌పేట సిటీ పోలీస్ లైన్స్, సికింద్రా బాద్ కంటోన్మెంట్‌కు సంబంధించి బోయిన్‌పల్లిలో, కార్వాన్ నియోజవర్గంలో కుల్సుంపు రా పోలీస్ క్వార్టర్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మించనున్నారు.