కాంగ్రెస్‌లో.. చెయ్యి కలపని నేతలు
- నామినేటెడ్ పదవులపై తర్జనభర్జన
- ఆశావాదులకు తప్పని నిరీక్షణ
- వాడి వేడిగా జిల్లా సమన్వయ సమావేశం
నిర్మల్ ,ఆగస్టు 12( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఐక్యత మరో సారి బెడిసి కొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల పంచాయతీ మూడు వర్గాల మధ్య మరోసారి విభేదాలు ఏర్పడి సమావేశం వాడిగా వేడిగా జరిగిన ట్టు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన జిల్లా కాంగ్రెస్లో ఐక్యత ఇంకా కనిపించడం లేదని కాంగ్రెస్ నాయకులు బ హిరంగంగా విమర్శిస్తున్నారు.
నిర్మల్ జిల్లా లో నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గం లు ఉండగా ఖానాపూర్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నిర్మల్ , ముధోల్ లో బిజెపి ఎమ్మె ల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెం డు నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటే ల్ ముధోల్ ఇన్చార్జిగా, కూచాడి శ్రీ హరి రా వు నిర్మల్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు.
జిల్లా లో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేసే బాధ్యతను డిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే కు అప్పగించారు. పార్టీ అధ్యక్ష పద వి చేపట్టినప్పటి నుంచి జిల్లాలో కాంగ్రెస్ లో ఉన్న అన్ని గ్రూపులను కలుపుకొని పార్టీ కార్యక్రమాలను అమలు చేస్తున్న డిసిసి అధ్యక్షుడికి పదవుల కేటాయింపులు మా త్రం కొంత తలనొప్పిగా మారినట్టు ప్రచా రం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అన్ని జిల్లాల్లో పిఎసిఎస్, ఎఫ్ ఏ సి ఎస్ పా లకవర్గాల పదవులపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది.
కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న సీనియర్ నాయకులకు పదవులు అప్పగించాల ని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. నిర్మల్ జిల్లాలో నిర్మల్ ముధోల్ నియోజకవర్గాల్లో వర్గ పోరు కారణంగా నామినేటెడ్ పదవుల ఎంపిక పార్టీకి సవాల్గా నిలుస్తోంది. నిర్మల్ లో శ్రీ హరి రావు వర్గం, ఐకి రెడ్డి వర్గం బలంగా ఉండగా ఇటీవలే మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి కూడా నిర్మల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి తమ అనుచరులకు పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది.
ఇక ముధోల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే లైన విట్టల్ రెడ్డి, నారాయణ రావు పటేల్ వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరూ తమ తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునేందుకు రాష్ట్రస్థాయిలో తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
వాడి వేడిగా సమావేశాలు
నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ నామినేటెడ్ పదవుల పాలకవర్గాల పై డిసిసి అధ్యక్షుడు కానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జ పటేల్ సీనియర్ నేతలతో మంగళవారం రాత్రి నిర్మల్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినట్టు చెప్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తో పా టు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ హరిరావు, ము ధోల్ మాజీ ఎమ్మెల్యేలు నరేంద్ర పటేల్ విట్ట ల్ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నేతలు అర్జుమన్ అలీ అప్పలగని చక్రవర్తి ఆనందరావు పటేల్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనట్టు చెప్తున్నారు.
నిర్మల్ జిల్లాలో 18 మండల పరిధి లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా ల పాలకవర్గాలను నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించారు. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఆయా వర్గాల చెందిన నేతలు పదవుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే దరఖాస్తు పెట్టుకున్న వారిలో వివిధ వర్గాలకు చెందిన వారు కావడంతో అన్ని వర్గాలతో డిసిసి అధ్యక్షులు చర్చించి ఒక అభిప్రాయానికి రావాలని పార్టీ నేతలకు సూచించారు.
పాలకవర్గాల ఖరారులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ జూనియర్ నేతలను సమన్వయం చేసుకొని అన్ని వర్గాలకు న్యాయం జరిగేటట్లు పార్టీ అధిష్టానం ఆదేశించినట్టు ఎమ్మెల్యే వివరించగా కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని కొందరు సీనియర్ నేతలు సూటిగానే ప్రశ్నించినట్లు చెప్తున్నారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశామని ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తే మేము పార్టీలో ఉండి ఏం చేయాలని నేతలను నిలదీశారు.
ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న తమకు కష్ట కాలంలో మేము గుర్తురామా అంటూ బీసీ ఎస్సీ వర్గాల చెందిన కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. ఇప్పటివరకు చాలామంది అనేక పదవులు పొందాలని తిరిగి వారికే పదవులు అప్పగించడం సరికాదని కొత్త వారికి యువతకు అవకాశం కల్పించాలని మరో నేత చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
పార్టీ అధిష్టానం కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తూ సమన్వయం చేసుకొని పాలకవర్గాలను ఖరారు చేయాలని సూచించినట్టు పార్టీ నేతలు చెప్పిన కొందరు నేతలు దీన్ని విభేదించినట్టు చెప్తున్నారు. ఇప్పటివరకు జిల్లా రాజకీయాల్లో అంతగా జోక్యం చేసుకొని మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి సైతం కొందరు నేతల తీరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.
తమ వర్గీల కూడా పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన రాజకీయ పదవులకు కొందరు అడ్డు పుల్లలు వేస్తున్నారని తాను కూడా సీనియర్ నేత అన్న విషయం గుర్తుంచు కోవాలని సూచించారు. ఇప్పటివరకు నిర్మల్ లో రెండు వర్గాలుగా ఉన్న కాంగ్రెస్ వేణుగోపాలచారి ఎంట్రీస్తో మూడో వర్గంగా ఏర్పడిందని చెప్తున్నారు.
ముధోల్ లో రాజీమార్గం
ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నామినేటర్ పదవుల విషయంలో ఒక రాజు మార్గం ఎంపికైనట్టు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, నారాయణరావు పటేల్ ఇద్దరు సీనియర్ నేతలు కావడంతో నామినేటెడ్ పదవుల్లో సమానంగా పదవులు ఇవ్వాలని జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్తున్నారు. ఈ మండలానికి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వను ఒక స్పష్టత రాలేదు.
కుల సమీకరణలు నేతల సమీకరణాలను సమీక్షించి పాలకవర్గాలను ప్రకటించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంటున్నారు. ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇద్దరు నేతలు కూడా కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని జిల్లా కమిటీ సూచించడంతో వారు అందుకు సుముఖం వ్యక్తం చేశారు.
ఇక ఖానాపూర్లో అక్కడ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం ఉండడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆయన వర్గాలకు దక్కి అవకాశం ఉంది. అయితే ఆ నియోజకవర్గంలో 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన రేఖ శాం నాయక్ వర్గాలకు కూడా కొంత అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేయగా దీన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని సమావేశంలో చెప్పడంతో సద్దుమణిగే అవకాశం ఉంది.






