16 April, 2026 | 5:11 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సమీప పోలీస్ స్టేషన్.. పాఠశాలలో దొంగతనమా?

16-04-2026 02:06 PM

తాళం పగలగొట్టి, బీరువా తాళం తెరిచి, రికార్డులు చిందర వందనం.

తుంగతుర్తి,(విజయక్రాంతి): గడచిన కొంతకాలంగా తుంగతుర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో రాత్రి వేళల్లోనే కాక ,పగటి వేళల్లో కూడా తాళం వేసి ఉంటే జోరుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు ఎదురుగా ప్రామిక పాఠశాల లో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి, పాఠశాల రూములో తాళం పగలకొట్టి, బీరువాలో ఉన్న, రికార్డులను చిందర వం  దనం చేసిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఉపాధ్యాయులు రఘుపతి గురువారం ఉదయం పాఠశాలకు రాగానే తాళం పగలగొట్టి ఉండగా, భయభ్రాంతికి లోనైనాడు. లోపటికి వెళ్లి పరిశీలించగా చిందరవందరంగా రికార్డులు పడి ఉండడం గమనించాడు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చుట్టూ గోడలు, ఆ ప్రక్కనే ప్రజలు ఇళ్లలో ఉన్నప్పటికీ, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, తాళం పగలగొట్టి, బోర్డుపై వికృతమైన బొమ్మలు వేసి, ఏది ఏమైనా  పోలీస్ స్టేషన్ ఉండి, దొంగతనం జరగడం పట్ల పలువురు గుసగుసలు విమర్శించుకుంటున్నారు. జరిగిన సంఘటన ప్రధానోపాధ్యాయులు రఘుపతి తెలియపరచారు .జరిగిన సంఘటనపై ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు పాఠశాల పై డేగ కన్ను, ఉంచవలసిన ఆవశ్యకత ఉందని, జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని పాఠశాల బృందం, గ్రామ ప్రజలు కోరుతున్నారు.