28 June, 2026 | 5:28 PM

పిల్లల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు

28-06-2026 04:47 PM

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి

 47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ గుర్రం వెంకటేశ్వర్లు (జివిఆర్)

పాల్వంచ,(విజయక్రాంతి): ఆరోగ్యమంతమైన పిల్లలే సమాజ భవిష్యత్తుకు మూలం అనే 47వ డివిజన్ కార్పొరేటర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పాత పాల్వంచ 47వ డివిజన్‌లోని ప్రైమరీ స్కూల్ ఆవరణలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పిల్లల ఆరోగ్య పరిరక్షణ ప్రతి తల్లిదండ్రి బాధ్యత. పోలియో వంటి వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఒక్క చిన్నారిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పాత పాల్వంచ ప్రజలకు విజ్ఞప్తి:

0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి సమీపంలోని పోలియో కేంద్రంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ఆరోగ్యవంతమైన భావి తరాల నిర్మాణానికి సహకరించండి.