16 April, 2026 | 5:10 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేత

16-04-2026 02:08 PM

కోనరావుపేట ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేసినట్లు సర్పంచ్ పసుల పోశయ్య తెలిపారు. గురువారం మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి ,కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున  కూలీలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకోవాలని ,ఎండలో పని చేయకూడదన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని సర్పంచ్ సూచించారు అయన వెంట వార్డ్ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి కూలీలు తదితరులు పాల్గొన్నారు.