పోలియో రహిత సమాజం కోసం కృషి
28-06-2026 04:14 PM
చేర్యాల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మెడిశెట్టి ఉమా
చేర్యాల: చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో శివాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంను చేర్యాల మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ మెడిశెట్టి ఉమా శ్రీధర్ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతు పోలియో రహిత సమాజం కోసం ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అవసరమైతే ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ఆరోగ్య శాఖ, ఆశ వర్కర్లు,మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని అన్నారు.






