4 May, 2026 | 2:11 AM

యువత స్వశక్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

04-05-2026 12:42 AM
  1. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ప్రముఖ సినీనటి సన 
  2. కనకమామిడి రెవెన్యూ పరిధిలో తామర కన్వెన్షన్ హాల్  ప్రారంభోత్సవం 

మొయినాబాద్ మే 3(విజయ క్రాంతి): యువత స్వశక్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, ప్రముఖ సినీనటి సన లు  పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి నిర్మించిన తామర కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం కన్వెన్షన్ నిర్వహిస్తున్న వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా లగడపాటి రాజగోపాల్, ఆయన సతీమణి జానకి, ప్రముఖ సినీనటి సనలు హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

అనంతరం నూతన కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలన్నారు. దేశంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువత ఉద్యోగాలు రాలేవని బాధపడవద్దని సూచించారు. తమకు నచ్చిన ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వ రుణాలతో స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీటి ద్వారా తమ కుటుంబాలకు స్వయం ఉపాధి తోపాటు హార్దిక అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

నాణ్యతతో నిర్మించిన తామర కన్వెన్షన హాల్ ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుందని, జాతీయ రహదారి హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు సమీపంలో ఉండడం అదృష్టం అని తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజల వినియోగానికి తామర కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కనకమామిడి గ్రామ సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి, వరప్రసాద్, గజల్ శ్రీనివాస్, నవీన్, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.