4 May, 2026 | 2:04 AM

భూ కబ్జాదారులకు మేలు చేసేలా హైడ్రా చర్యలు

04-05-2026 12:40 AM
  1. బీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి
  2. ప్రజయ్ గుల్మహార్ ప్రహారీ కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే మండిపాటు

అబ్దుల్లాపూర్ మెట్, మే 3: భూ కబ్జాదారులకు మేలు చేసేలా హైడ్రా చర్యలు తీసుకుంటుందని బీ ఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు.  పూర్తిగా కబ్జాకు గురైన పెద్దఅంబర్ పేట్ లోని కార్ఖానా కుంట పరిసర ప్రాంతాన్ని, ఈ మధ్యకాలంలో ప్రజయ్ గుల్మహార్ కాంపౌండ్ వాల్ హైడ్రా కూల్చివేతలను స్థానిక బీఆర్‌ఎస్  నాయకులతో కలసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్ఖానా కుంట  7 ఎకరాల 20 గుంటలు ఉండగా.. ప్రస్తుతం మిగిలింది రెండు ఎకరాలు మాత్రమేనని అన్నారు. ఆ కుంటాను కాపాడాల్సిన బాధ్యత హైడ్రా, ఇరిగేషన్ అధికారులకు లేదా అని ప్రశ్నించారు.  కేవలం ప్రజయ్ గుల్మోహర్ కాలనీ కాంపౌండ్ వాల్ మీద దృష్టి పెట్టటం వెనుకాల ఆంతర్యం ఏమిటో  అర్థం కావడం లేదని అన్నారు.

అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు  మేలు చేయడం కోసం 241 ఇల్లు కలిగియున్న కాలనీకి భద్రతా లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.గత 15 ఏండ్లుగా భద్రంగా ఉన్న కాలనీ, కాలనీ ప్రజలను భద్రతా లేకుండా భయభ్రాంతులకు గురి చేయడం సరైనది కాదని అధికారులను హెచ్చరించారు. కబ్జాకు గురైన  కార్ఖానాకుంటను వదిలేసి.. ప్రజయ్ గుల్మహార్ కాలనీ గోడను ఎందుకు కూల్చరని అన్నారు.హైడ్రా సమస్యలపై పోరాడుతానని కాలనీ వాసులకు హామీనిచ్చారు.పరిశీలించిన వారిలో కాలనీ అధ్యక్ష కార్యదర్శులు కృపాసాగర్, 

శివరామకృష్ణ,  కాలనీ కార్యవర్గం సభ్యులు,  స్థానిక బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఈదమ్మల బలరామ్, కళ్లెం  ప్రభాకర్ రెడ్డి, పాశం దామోదర్, అనంతుల వెంకటేశ్వర్ రెడ్డి, రావుల గోపాల్ గౌడ్, దేశారం  బాలకృష్ణ, పిల్లి నగేష్, మాడ్గుల వెంకటేష్ గౌడ్, వెంకట్ రెడ్డి, జోర్క  రాము, ఎండీ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.