4 May, 2026 | 2:12 AM

వైభవంగా బొడ్రాయి పండుగ పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

04-05-2026 12:44 AM

కందుకూరు, మే 3 (విజయక్రాంతి): కందుకూరు మండలం కటికపల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.గ్రామ దేవత బొడ్రాయికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.  నాయకులు మన్నే జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు లక్ష్మీ, నరసింహ రెడ్డి,సురసాని సురేందర్ రెడ్డి, కాకి ఇందిరా దశరథ ముదిరాజ్, మండలం కృష్ణ,బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.