27 July, 2026 | 12:28 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి

29-05-2026 01:48 AM

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ

కొండాపూర్, మే 28: అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో, కళ్లాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. గురువారం కొండాపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో జిల్లా రైతు సంఘం ఇంచార్జీ దశరథ్‌తో కలిసి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సొసైటీ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో తడిసిన ధాన్యంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వనతులను కల్పించాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి కాంటాల్లో వేయడం లేదన్నారు.

ఖరీఫ్ పంటకు సకాలంలో రైతులకు ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆకాల వర్షాలతో ఆరబోసి న వరి, జొన్న పంటలు దెబ్బతిన్నాయని, ఈ సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, పాడి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సంజీవరెడ్డి, నాయకులు రాంరెడ్డి, బ్రహ్మం, బాల్ రాజ్ నర్సిం లు, శివరాములు తదితరులు పాల్గొన్నారు.