సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.
27-07-2026 11:44 AM
రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్‌కు కృతజ్ఞతలు
కోనరావుపేట జులై 27(విజయక్రాంతి): తెలంగాణ గౌడ యువజన సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా అబ్బసాని సందీప్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి నియామక పత్రాన్ని అందజేసి, జిల్లా అధ్యక్షునిగా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గౌడ యువజన సంఘం ఆశయాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా గౌడ యువతను సంఘటితం చేయడంతో పాటు, సామాజిక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం కృషి చేస్తానని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.






