29 May, 2026 | 3:19 AM

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

29-05-2026 01:46 AM

ముస్లిం మైనారిటీ నాయకులు 

చేగుంట, మే 28: చేగుంట మండల కేంద్రంలోని ఈద్గాలో బక్రీద్ సందర్భంగా ముస్లింలు శాంతియుత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం  ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ  ఆవును జాతీయ జంతువుగా ప్రక టించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న, దాడుల నేపథ్యంలో బక్రీద్ సందర్భంగా ఎవరూ ఆవులను బలి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. జాతీయ పక్షి నెమలి మాదిరిగానే ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ ఈమమ్ అన్వార్ ఉల్ హాక్, నాయ బ్ సదర్ రహేమోద్దీన్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.