27 July, 2026 | 12:50 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

27-07-2026 12:03 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, మోటార్లును ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud) అన్నారు. జూరాల ప్రాజెక్టులో ఇప్పటికే 7.1 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుందని, గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు, పాలమూరు రైతుకు నీళ్లు అందించకుండా, ఆ నీటిని శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డిపాడుకు వెళ్లేలా చేయడానికే పంపులను ఆన్ చేయడం లేదని, ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు.

వరదొచ్చినప్పుడు నీటిని ఎత్తిపోయకుండా కిందికి జార విడుస్తుందన్నారు.  తక్షణమే భీమా-1లోని భూత్‌పూర్ (1.3 టీఎంసీ), సంగంబండ (3.3 టీఎంసీ), భీమా-2లోని శంకర సముద్రం (1.8 టీఎంసీ), రంగసముద్రం (1.9 టీఎంసీ), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి (1.2 టీఎంసీ), ర్యాలంపాడు (4 టీఎంసీ),  కోయిల్‌సాగర్ (1.5 టీఎంసీ) రిజర్వాయర్లను నింపేందుకు వెంటనే మోటార్లను ప్రారంభించాలని, జూరాల ఎడమ, కుడి కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.