27 July, 2026 | 12:51 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

27-07-2026 12:00 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే(Yellandu constituency MLA) కోరం కనకయ్య సోమవారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గర్భిణీలకు నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన పరీక్షలు, మందులు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ఆప్యాయంగా, ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచేలా సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో స్థానిక వైద్యాధికారి డా. కంచర్ల వెంకటేష్, సర్పంచ్ పూల్ బంతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.