29 May, 2026 | 2:56 AM

లారీల కొరతతో రోడ్డెక్కిన రైతులు..

29-05-2026 01:50 AM

మెదక్, నర్సాపూర్ రహదారిపై ఆందోళన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు  

నర్సాపూర్‌ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

వెల్దుర్తి, మే 28 : రైతులు ఆరుగాలం పం డించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే కొను గోలు కేంద్రాలలో లారీలు సరిగ్గా రావడంలేదని గురువారం వెల్దుర్తి మండల కేంద్రం లోని నర్సాపూర్, మెదక్ ప్రధాన రహదారి లో గ్రామస్తులు, రైతులతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రహదారిపై నిరసన తెలిపారు.

రైతులు ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ధా న్యం తరలింపులో జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట పం డించిన సమయం కంటే కొనుగోలు సమయమే ఎక్కువగా అవుతుందని రాత్రి కురి సిన వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యం వలన కష్టపడి పండించిన పంటలు వర్షాలతో నీటిపాలు అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

తడిసిన ధాన్యంను తరగు పేరుతో  మిల్ల ర్లు కొనుగోలు చేయకపోవడంతో క్వింటాలుకు  3  నుండి 4 కిలోలు తరుగు తీయడం తో నష్టం వాటిల్లుతుందని వారు అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు అనిచెప్పి  ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అ ని,  రైస్ మిల్లుల దగ్గర లారీలు, ట్రాక్టర్లు, రో జుల  తరబడి ఉంటున్నాయి తొందరగా లా రీలలో ఉన్న ధాన్యం బస్తాలను కాలి చేయకుండా రైస్ మిల్లర్లు జాప్యం చేస్తున్నారు.ఈ జాప్యంతో రైతులకు తరుగుతో నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీ సులు, రెవెన్యూ అధికారుల జోక్యంతో ఆం దోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రై తులు భూపాల్ రెడ్డి, రమేష్ గౌడ్, కృష్ణ గౌ డ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.