30 June, 2026 | 11:03 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

13-04-2026 12:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): నిలువ నీడలేని పేదలకు పక్కా ఇల్లు కట్టించి, పేదలకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిలుస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. ఆమనగల్ బలరాం నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఆదివారం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ ఉమతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిలువ నీడలేని నిరుపేదలకు తమకున్న స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు మంజూరు చేసి, నివాస గృహాలను నిర్మించి ఇస్తున్నామన్నారు. పేద కుటుంబాలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వికలాంగులు, భూమిలేని వ్యక్తులకు విడతల వారిగా మంజూరు చేస్తామని, ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తానన్నారు.