జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన సహస్ర
మహబూబాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): 69వ ఎస్ జీ ఎఫ్ జాతీయస్థాయి అండర్ 14 సాఫ్ట్ బాల్ పోటీలకు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన బొల్లు సహస్ర ఎంపికైనట్లు హెడ్మాస్టర్, ఇంచార్జ్ ఎంఈఓ రూపా రాణి, ఫిజికల్ డైరెక్టర్ ప్రణయ్ తెలిపారు.
ఇనుగుర్తి స్థానిక జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న సహస్ర నెల్లికుదురులో గత నెల 7 నుండి 9 వరకు నిర్వహించిన అండర్ 14 సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలలో వరంగల్ జట్టు నుంచి ఉత్తమ ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు జిల్లా ఎస్జీఎఫ్‌ఐ సెక్రటరీ జీ.సత్యనారాయణ తెలిపినట్లు వారు చెప్పారు.
గారు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈనెల 16వ తారీకు నుండి 22వ తారీకు వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో విద్యార్థిని సహస్ర పాల్గొనడం జరుగుతుందన్నారు. జాతీయ పోటీలకు సహస్ర ఎంపికయ్యల కృషిచేసిన ఫిజికల్ డైరెక్టర్ తాళ్ళ ప్రణయ్, ఎంపికైన సహస్రను ఉపాధ్యాయ బృందం అభినందించారు.




