6 May, 2026 | 10:35 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

నవాబ్ కేఫ్‌గా మారిన ‘చాయ్‌వాలా’ టైటిల్

11-02-2026 01:33 AM

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రల్లో నటించి చిత్రం ‘నవా బ్ కేఫ్’. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాను హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వీ పపుడిప్పు నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానున్న క్రమంలో చిత్రయూనిట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సమావేశంలో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. “చాయ్ వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం. ‘చాయ్‌వాలా’ను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు చాలా కష్టపడ్డాం.

సెన్సార్ రూల్స్, గైడ్‌లైన్స్‌ను గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ‘నవాబ్ కేఫ్’ టైటిల్ మా సినిమాలోని స్టోరీని, ఆత్మని తెలియజేస్తుంది. టైటిల్ చేంజ్ అయినా, సెన్సార్ సమస్యలు వచ్చినా మా నిర్మాత వెంకట్ ఎక్క డా రాజీ పడకుండా నిలబడ్డారు. ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్తోనే మళ్లీ ప్రమోట్ చేద్దామని టీమ్ అంతా ముందుకు వచ్చింది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫిబ్రవరి 20న ‘నవాబ్ కేఫ్’ అనే కొత్త పేరుతో ప్రేక్షకుల ముం దుకు రాబోతోన్నాం” అన్నారు. హీరోయిన్ తేజు అశ్విని మాట్లాడుతూ.. “ఏ టైటిల్ పెట్టినా కంటెంట్ బాగుంటే, సినిమా నచ్చితే ప్రేక్షకులు ఆదరిస్తారు.

ఇది నా మొదటి చిత్రం. ఓ మంచి ప్రొడక్ట్ బయటకు రావాలనే ఇలా దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఫిబ్రవరి 20న మా సినిమా రాబోతోంది” అని తెలిపారు. ‘నేను చూసిన, అనుభవించిన సంఘటనల్ని ఆధారంగా చేసుకునే ఈ కథను రాసుకున్నాన’ని దర్శకుడు ప్రమోద్ హర్ష చెప్పారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. “అసలు మాకు టైటిల్ మార్చమని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. నేను ముంబైకి వెళ్లాను. సెన్సార్ టీంతో మాట్లాడాను. ‘చాయ్ వాలా’ అనే టైటిల్ వద్దు అని చెప్పారు. ఆ తర్వాత మేం చాలా టైటిల్స్ అనుకున్నాం. కానీ మేం వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్న ‘నవాబ్ కేఫ్’నే చివరకు ఫిక్స్ చేశాం” అని చెప్పారు.