calender_icon.png 11 February, 2026 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కపుల్ ఫ్రెండ్లీ పెద్దలకు మాత్రమే అనేది బద్ధం!

11-02-2026 01:31:06 AM

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌కుమార్ రాజు పీ సహా య నిర్మాత. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజి కల్ రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోం ది. ఈ సినిమాను ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని తెలంగాణ, ఏపీ ల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భం గా మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. “కపుల్ ఫ్రెండ్లీ‘ టైటిల్ చెప్పినప్పుడు నాలో డౌట్స్ ఉండేవి. ఈ టైటిల్ ఎందుకు పెట్టామనేది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. మిత్ర, శివ జర్నీ ఈ సినిమా. మిత్ర తనకు పరిచయం అయ్యాక శివ జీవితం ఎలా మారింది, మిత్ర కోసం శివ ఎంతవరకు వెళ్లాడనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం” అని చెప్పారు.

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ.. “మా డైరెక్టర్ తమిళ్‌లో స్క్రిప్ట్ రాస్తే, మేము తెలుగులో డైలాగ్స్ మార్చుకుని వాటిని రిథమ్, టైమింగ్ పోకుండా ప్రాక్టీస్ చేసేవాళ్లం. ఈ చిత్రంలో టీమ్ వర్క్ అంటే ఏంటో చూశా. మా సినిమాను థియేటర్లలో తప్పకుండా చూడండి” అన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మాట్లాడుతూ.. “కపుల్ ఫ్రెండ్లీ‘ టైటిల్ మార్చమని సెన్సార్ వారు అడిగారు. అయితే ఈ టైటిల్‌తోనే సినిమా తెరకెక్కింది, ఈ టైటిల్‌తోనే పబ్లిసిటీ చేశాం.

మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు టైటిల్ మార్చడం సరికాదని ఇదే కొనసాగిస్తామని చెప్పాం. దాంతో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. తమిళంలో మాత్రం ఇదే టైటిల్‌తో యూఏ సర్టిఫికేషన్ సెన్సార్ నుంచి దక్కింది. ఈ సినిమాలో పెద్దలు చూసే కంటెంట్ ఉంటుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఒదొక ప్యూర్ లవ్ స్టోరీ. చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనుకోవచ్చు. అన్నివర్గాల ప్రేక్షకులు మా సినిమాను ఇబ్బందిపడకుండా చూడొచ్చు” అన్నారు.