calender_icon.png 7 February, 2026 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీ బగలాముఖి శక్తిపీఠం తృతీయ వార్షికోత్సవం

07-02-2026 01:44:52 AM

సుహాసినిలచే ఘనంగా హరిద్రార్చన

శివంపేట, ఫిబ్రవరి 6 : శివంపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ భగలాముఖి శక్తిపీఠం తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా బగలాముఖి శక్తి పీఠం ట్రస్ట్ సభ్యులు పీఎంజి యువసేన సభ్యులు వచ్చిన భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు జరిగాయి.

ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, ప్రధాన దేవత మండప స్థాపన పూర్వక పూజ, అగ్ని ప్రతిష్ట భగలాముఖి మహా మంత్ర వాహనం గంగా గోదావరి పుణ్యతీర్థములతో అమ్మవారికి మహాభిషేకం కృతయుగంలో పసుపు నీటి కందకంలో అమ్మ అవతరించినందున అమ్మవారికి వెయ్యి మంది సువాసనలచే మహా ఆరుద్రార్చన పసుపుతో అర్చన చేశారు. అనంతరం బగలాముఖి శక్తిపీఠం పల్లకి సేవ, మహా మంగళ నీరాజనం చేశారు.

వచ్చిన భక్తులకు, బగలాముఖి శక్తిపీఠం స్థలదాత పబ్బ స్వరూపారాణి రమేష్ గుప్తా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అభినవ దండ విద్యాశంకర భారతీమహా స్వామి వారు విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా, శివంపేట సర్పంచ్ రాజి పేట వెంకటేశ్వర్, ఉప సర్పంచ్ మల్లేష్, మాజీ సర్పంచ్ పాత్రల శ్రీనివాస్ గౌడ్, కృష్ణారావు, శ్రీనివాస్ గౌడ్ మర్రి కృష్ణారెడ్డి , నాగేశ్వరరావు పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు, భగలాముఖి శక్తిపీఠం భక్తులు తదితరులు తృతీయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.