విలక్షణ విజయ్!
- తమిళనాడు సీఎంగా వినూత్న నిర్ణయాలు
- చట్టాల అమలులో గణనీయ మార్పులు
- డ్రగ్స్, మద్యం మాఫియాపై ఉక్కుపాదం
- సామాజిక న్యాయానికి పెద్దపీట
- దేశానికే ఆదర్శంగా జోసెఫ్ విజయ్ పాలన
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి) : తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ పాలనలో తనదైన మార్క్ వేసే దిశ గా అడుగులు వేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అవినీతి నిర్మూలన, మద్యం మాఫియాపై ఉక్కుపాదం, మ హిళా భద్రత, డ్రగ్స్ నియంత్రణ ఇలా మరెన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
పాలనలోనూ సంచలనమే..
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నటుడు జోసెఫ్ విజయ్.. పాలనలోనూ వినూత్న నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ద్రావిడ పార్టీల ఆరు దశాబ్దాల ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ ఆయన స్థాపించిన టీవీకే.. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. అనతికాలంలో నే సంచలనాత్మక నిర్ణయాలతో పాలనలో కొత్త మార్గదర్శకత్వం చూపిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉందని, రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే వెల్లడించిన విజయ్.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిం దని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తొలిసారిగా శ్వేత పత్రం విడుదలకు ఆయన ప్రభుత్వం సిద్ధమవుతోంది.
డ్రగ్ ఫ్రీ తమిళనాడు లక్ష్యంగా..
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే చట్టాల అమలులో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం, 300 మం దికి పైగా నేరస్తులు స్వయంగా లొంగిపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. డ్రగ్ ఫ్రీ తమిళనాడు లక్ష్యంగా.. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక యాంటీ నార్కోటిక్స్ విభాగాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు మహిళల భద్రత కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ బలగాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట
విజయ్ కేబినెట్‌లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. 29 ఏళ్ల ఎస్. కీర్తనకు పరిశ్రమల శాఖ అప్పగించడం ద్వారా యు వతకు అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా విద్యాశాఖను దళితుడైన రాజ్‌మోహన్ అప్పజెప్పడం సామాజిక సమానత్వానికి ప్రతీకగా మారింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో తెల్లని వస్త్రాల తొలగింపు
ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై వేసే తెల్లని వస్త్రాలను తొలగించాలని విజయ్ ఆదేశించడం కూడా చర్చనీయాంశమైంది. ఇవి అధికార ప్రతీకలుగా, కుల ఆధిపత్య సూచికలుగా మారాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలను అధికారులు కూర్చోబెట్టి మాట్లాడాలని కూడా సీఎం ఆదేశించారు.
సీఎం విజయ్ పనితీరుపై చర్చ
విజయ్ ఇంటి నుంచి తెచ్చుకున్న సాధారణ భోజనం తింటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అధికారం అంటే ఆడంబరం కాదని, సాధారణ జీవనశైలితో కూడా ప్రజల మనసులు గెలుచుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారని అభిమానులు అంటున్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ను ఆపకూడదని విజయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అధికారులకు సూచించారు. విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఈ-మెయిల్ వ్యవస్థ
ప్రజా సమస్యలు నేరుగా సీఎంకు చేరేలా ప్రత్యేకంగా ఈ-మెయిల్ వ్యవస్థను విజయ్ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు, సమస్యలను నేరుగా సీఎం కార్యాలయానికి పంపవ చ్చు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం అనే భావనను ఇది బలపరుస్తోంది.
717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం
టాస్మాక్(తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్) మద్యం దుకాణాలపై విజయ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశిం చింది. అదే విధంగా 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయించరాదని, తప్పనిసరిగా ఐడీ తని ఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిం ది. రాత్రి 10 గంటలకే మద్యం షాపులు మూసివేయాలని నిర్ణయించింది. ఆదాయం పై కాకుండా ప్రజల ఆరోగ్యం, భద్రతపై దృ ష్టి పెట్టిన ప్రభు త్వం అనే సందేశం ఇచ్చింది.






